Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్యామ్ రావు అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం మైనారిటీలకు 12 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్న తమ కులస్తులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం తమను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ఓటు అని ఆయుధాన్ని వినియోగిస్తామని హెచ్చరించారు. నేడు హైదరాబాదులో కొమురం భీమ్ బంజారా భవన్ ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి మాలి కులస్తులకూ న్యాయం చేసే ప్రకటన చేయాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి వసంతరావు, గురునాలే నారాయణ ఉపాధ్యక్షులు, కొమరం భీం జిల్లా అధ్యక్షులు ఎన్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.