Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రయివేట్ సైకియాట్రీ, ఆశా హాస్పిటల్ హైదరాబాద్ సహకారంతో ఈనెల 16 నుంచి 18 వరకు ప్రపంచ మానసిక నిపుణుల సదస్సు జరగనుంది. ఈసందర్భంగా ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ సైకియాట్రిక్ అసోసియేషన్స్ అధ్యక్షుడు డాక్టర్ జి ప్రసాదరావు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్లో రెండురోజుల పాటు జరగనున్న డబ్ల్యూసీఏపీ-2022 కాన్ఫరెన్స్ ప్రపంచం నలుమూలల నుంచి మానసిక ఆరోగ్య నిపుణులను ఒకచోట చేర్చి కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. తాము శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి ప్రతినిధుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామన్నారు. 2019 గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి 4 మందిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. కోవిడ్ కారణంగా ఆందోళన, నిస్పృహ రుగ్మతలతో జీవించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం దాదాపు 7.5 శాతం మంది భారతీయులు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చెప్పారు. సుమారు 56 మిలియన్ల మంది భారతీయులు డిప్రెషన్‌తో, 38 మిలియన్ల మంది ఆందోళన రుగ్మతలతో సతమతమవుతున్నారని ఆయన వివరించారు.