Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజికవేత్త పీఎల్ఎన్ రావు
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్రంలోని సర్కార్ దవాఖానాల ప్రయోజనాలను దెబ్బతీయొద్దని సామాజికవేత్త పీఎల్ఎన్ రావు అన్నారు. హైదరాబాద్‌లో గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంఎన్‌జే హాస్పిటళ్లు పేద ప్రజలకు ప్రభుత్వ సహకారంతో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సామాజికవేత్త పీఎల్ఎన్ రావు మాట్లాడారు. గతంలో కాంట్రాక్టు పద్ధతుల్లో ఆస్పత్రి క్యాంటీన్లు కొనసాగించిన పలువురు తీవ్ర అక్రమాలకు పాల్పడి కోర్టు కేసులు ఎదుర్కొని జైల్లోకి వెళ్లి వచ్చి తిరిగి వారి బినామీల రంగ ప్రవేశానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నారు. నీలోఫర్ ప్రస్తుతం 500 పడకలతో అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో శస్త్ర చికిత్సలు ఎందరో మంది పసిపిల్లలకు వైద్యం అందించి ప్రాణాలు కాపాడుతూ అంతర్జాతీయ ఖ్యాతిని పొందిందన్నారు. అటువంటి ఆస్పత్రిలో కొందరూ నకిలీ ఇన్వెంటెడ్లు తయారు చేయడం, ఉద్దేశపూర్వకంగా డైట్ షెడ్యూల్ మార్చడం, ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టిసున్నారని ఆరోపించారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారు కాంట్రాక్టర్లకు, బినామీలకు కాంట్రాక్టులు అప్పజెప్పడం పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని విషాహారంగా మార్చడమేనని ఆవేదన వ్యక్తపరిచారు. అధికారులు ఇచ్చిన అనైతిక కాంట్రాక్టర్ల వల్ల తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల డబ్బును కోల్పోయిందన్నారు.