Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ నాయకులు ఎంఎన్ శ్రీనివాసరావు
నవతెలంగాణ-అడిక్మెట్/ఓయూ/కూకట్పల్లి
తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పక్షపాతిగా చరిత్రలో మిగిలిపోతారని గ్రేటర్ టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని దేశంలో తొలిసారి అసెంబ్లీలో తీర్మాణం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దక్కిందన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే బీజేపీ విలీన దినోత్సవానికి సంబంధం లేకున్నా లేనిపోని హడావుడి చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ సచివాలయానికి డా.బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించిన సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట టీఆర్ఎస్వై, టీఆర్ఎస్వీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కోతి విజరు రావు, వేల్పుకొండ వెంకటేష్, జంగయ్య, రమేష్ గౌడ్, పానుగంటి విజరు మోహన్, దాత్రిక స్వప్న, వేల్పుకొండ రామకృష్ణ, రంగా, సందీప్, రోహిత్ పాల్గొన్నారు.
కొత్త పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఎల్లమ్మబండ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సంద్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బీజేపీకి దమ్ముంటే నూతన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు తీర్మానించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, కాశీనాథ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, బాలస్వామి, అగ్రవాసు, వెంకటేష్, అంజయ్య యాదవ్, వెంకట్, ఎత్తరి శ్రీను, మారుతి, దేవేందర్, కటికరవి, జనయ్య, దుర్గేష్, సంతోష్ పాల్గొన్నారు.