Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బీసీల ఓట్లు ప్రభుత్వానికి అక్కర్లేదా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా బీసీల భవనాలు కేటాయించలేదన్నారు. ఇతర భవనాల నిర్మాణాలు స్థలాల కేటాయింపునకు తాము వ్యతిరేకం కాదని, జ్యోతిరావు పూలే విగ్రహం, బీసీ భవన్ ఎందుకు అమలు చేయడంలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి బీసీల భవన నిర్మాణానికి వంద కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు ఖరారు చేయడం అభినందనీయమన్నారు. సమావేశంలో కె. శ్యామ్ సుందర్, కె, శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, సదానందం, నాగేష్ గౌడ్, మధు, ప్రవీణ్, స్వర్ణలత, గౌతమి తదితరులు పాల్గొన్నారు.