Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ లింబాద్రికి ఉద్యోగ సంఘాల వినతి
నవతెలంగాణ-ఓయూ
యూనివర్సిటీలో పనిచేస్తున్న టైం స్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఓయూ ఎన్జీఓస్ అధ్యక్షుడు బియాని. జ్ఞానేశ్వర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొ.ఆర్. లింబాద్రికి వినతిపత్రం అందజేశారు. టైం స్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. 2001 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాతపెన్షన్, 2004 సెప్టెంబరు తర్వాత నియమితులైన ఉద్యోగులకు సీపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, వీసీలతో చర్చించి త్వరలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్పారు.. కార్యక్రమంలో నాయకులు రవి, ఎస్.విజయ్ కుమార్, అక్బర్ బేగ్, శంకర్ నాయక్, శంకరయ్య, అశోక్, రాకేష్, నారాయణ పాల్గొన్నారు.