Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలక్‌నుమా ఏఈ రాజుకు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-ధూల్‌పేట్
విపరీతంగా వస్తున్న కరెంట్ చార్జీలను వెంటనే నియంత్రించాలని సీపీఐ(ఎం) జంగంమేట్ డివిజన్ కార్యదర్శి కృష్ణ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఫలక్‌నుమా ఏఈ రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ నాయక్ మాట్లాడుతూ జంగంమేట్ డివిజన్లోని కొన్ని బస్తీల్లో కరెంట్ బిల్లు విపరీతంగా రావడం వల్ల ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి పేదల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా చార్జీలు పెంచడం వల్ల పేద ప్రజలు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. కరెంటు చార్జీలు తగ్గించే బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాలన్నారు. డివిజన్లో పాత బకాయిల సమస్యలు పరిష్కారానికి అవకాశం కల్పించాలని సూచించారు. ప్రజల్లో అందుబాటులో కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తమ వంతు కృషి చేస్తానని ఏఈ రాజు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎస్ కిషన్, స్థానిక నాయకులు శ్రీను, మహేష్, హీరాలాల్, చిన్న, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.