Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల నిర్మూలన వేదిక
నవతెలంగాణ-ఓయూ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరి జిల్లాలో దళిత మైనర్లపై లైంగికదాడి ఘటనను ఖండిస్తూ కులనిర్మూలన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. లైంగికదాడి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలనలో దళిత, బహుజనులుపై హత్యలు, అఘాయిత్యాలు, దాడులు పెరిగాయని చెప్పారు. ఈ విష సంస్కతి తెలంగాణలో కూడా వ్యాపిస్తున్నదన్నారు. దళిత బహుజనులపై దాడులు, హత్యలు, లైంగికదాడి చేసిన వారిని ప్రజాద్రోహులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుల నిర్మూలన వేదిక రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాపని నాగరాజు, కోట ఆనంద్, సభ్యులు చందు, సాయి, ప్రసాద్, దీపక్, గణేష్ పాల్గొన్నారు.