Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలన అంతం కోసం సాగించిన మహ త్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల దేననీ, సాయుధ పోరాట చరిత్రను పాలకులు పాఠ్యపుస్త కాల్లో చేర్చాలని అఖిల భారత యువజన సమాఖ్య మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు టి.సత్య ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉప్పల్ మండల విస్త్రృత కౌన్సిల్ సమావేశం మల్లాపూర్లో నిర్వ హించారు. ఈ సమావేశానికి సత్య ప్రసాద్ ముఖ్య అతిథి గా హాజరు కాగా.. రాజ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడు తూ మతోన్మాద బీజేపీ నాయకులకు సాయుధ పోరాట చరిత్ర గురించి మాట్లాడే హక్కులేదన్నారు. 75వ తెలంగా ణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ లబ్దికోసమే బూర్జు వా పార్టీలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందూ, ముస్లింల పోరాటంగా చిత్రీకరిస్తున్నా రన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని రావి నారాయ ణరెడ్డి, మక్ధూమ్ మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి వంటి మహనీయులు అగ్రభాగాన నిలబడి పోరాటం సల్పించార ని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. భూస్వామ్య వ్యవస్థ నిర్మూలనకు, బానిస బతుకుల విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ నిర్వహిం చిదన్నారు. అంతటి మహత్తర పోరాటాన్ని, స్ఫూర్తిని నేటి తరానికి తెలియనీయకుండా నేటి పాలకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనీ, అలాంటి వారిని చరిత్ర భూస్థాపితం చేస్తుందన్నారు. సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకా ల్లో ముద్రించి, భోదించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17వ తేదీన సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్న తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుందాం పేరిట నిర్వహిస్తున్న బహి రంగ సభకు సంపూర్ణ మద్దతు ఉందనీ, ఈ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరుకానున్నామని వారు తెలిపారు. ఈ సమావేశంలో సంజరు, మణి, మనిదీప్, హర్ష, కిరణ్, ఆజాద్ లతో పాటు 30మంది యువకులు పాల్గొన్నారు.
ఉప్పల్ మండల నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
ఉప్పల్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. అధ్యక్షుడుగా వి.రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా ఎం.విజరు, ఉపాధ్యక్షులుగా దుర్గా ప్రసాద్, ఎండీ. సద్దాం, అమర్, సహాయ కార్యదర్శిగా హరికృష్ణ, పవన్, కోశాధికారిగా టి.రాజేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇస్మాయి ల్తోపాటు 20మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు.