Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్ నగర్
అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్వేచ్ఛ వేదిక సొసైటీ డైరెక్టర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. తర్వాత జెడ్పీహెచ్ఎస్ జవహర్ నగర్ పాఠశాలలో ఉపా ధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ ఓజోన్ పొర దినోత్సవం ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారనీ, అందులో భాగంగానే ఇక్కడా నిర్వహిం చినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఓజోన్ పొరను పరిరక్షించడంలో బాధ్యత వహించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అడవులను పెంచడం ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పరచుకోవడం కోసం కృషి చేయడంచ వాటితో పాటుగా పర్యావరణం మార్పులపై ఓజోన్ పొర క్షీణిత పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అన్ని ప్రాంతాల్లో అడవుల నరికివేతను పూర్తిగా నిలిపివేయాలని మొక్క లను పెంచాలని యంత్రాల నుంచిి విషవాయు వాయు వులు విడుదల చేసే పరిశ్రమలను అరికట్టి రక్షణ చర్యలు చేపట్టడం. లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రపంచ జీవకోటి జీవరాశికి ఓజోన్ పొర అనేది చాలా ముఖ్యమైందని వివరించారు. ఓజన్ పొర దెబ్బ తినడం వల్ల మానవ మనుగడకు ముప్పు వాటిల్లు తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు శంకరయ్య, పాఠశాల ఇన్చార్జి గోపాల్, ఉపాధ్యాయులు ఆదినారాయణ, ఎన్.జ్యోతి, పుష్పాంజలి, గీత, సౌజన్య, సంస్థ ప్రతినిధులు రాకేష్, శ్యామ్, విద్యార్థి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.