Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఇండ్ల ముందు మురుగు మలినాలు, కంపు వాసనతో ఇబ్బందులు పడుతున్నామనీ, చర్లపల్లి డివిజన్ భగవాన్ కాలనీలో రోడ్లపై నిత్యం ఏరులై పారుతున్న మురుగు మలినాలను తొలగించాలని భగవాన్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. 5 నెలలుగా మురుగు ఇండ్ల ముందు పారుతున్నా పట్టించుకోవడం లేదని శుక్రవారం కాలనీవాసులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, మహిళలు మాట్లాడుతూ కాలనీలోని రోడ్డు నెంబర్ 3,6 ల లోని అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పొంగి పొర్లుతూ మలినాలు ఇండ్ల ముందు తిష్ట వేస్తూ తీవ్ర దుర్వాసనతో రోజూ ఇబ్బంది పడుతు న్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో మురుగుకు తోడు ఇటీవల కురిసిన వర్షాల మూలంగా విష జ్వరాలతో బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా మా బాధలు కనిపించడం లేదా? అని కాలనీవాసులు, మహి ళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాత్యుల చేతుల మీదు గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగి 3 మూడు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు డ్రైనేజీ నిర్మాణం పనులు అడుగు కూడా కదలడం లేదన్నారు. ఇకనైనా జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్, జలమండలి ఉన్నతాధికారులు భగవాన్ కాలనీలో రాచపుండును తలపించేలా పొంగి ప్రవహిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను దృష్టిలో పెట్టుకుని డ్రయినేజీ పనులు మొదలయ్యేలా చర్యలను వేగవంతం చేయాలని కోరారు.