Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తు న్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హౌటల్ సర్కిల్ నుంచి ఎంజీ రోడ్డులోఇ మహాత్మాగాంధీ విగ్రహం వరకు, అమీర్‌పేట డివిజన్లోని కనకదుర్గమ్మ ఆలయం నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వరకు భారీ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. గాంధీ విగ్రహం వరకు చేరుకున్న తర్వాత గాంధీ విగ్రహం వద్ద పూలు సమర్పించి నివాళ్లు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దేశం గర్వపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేసుకలను వైభవంగా నిర్వహిస్తుందని తెలిపారు. జాతీయ స్ఫూర్తిని చాటే విధంగా ఈ నెల 16,17,18 మూడు రోజులు ఈ వజ్రోత్స వ వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 17న ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుందనీ, ఈ సభకు సీఎం కేసీ ఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతురని చెప్పారు. అంబేద్కర్ పేరును తెలంగాణ సెక్రెటరీయేట్‌కు పెట్టడం ఎంతో గర్వ కారణం అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 8 ఏండ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరి, కొలన్ లక్ష్మీ, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణగౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి, ఆర్డీఓ వసంత, డీఈఓ రోహిణి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : విద్యార్థులంటే ఆణిముత్యాలనీ, దేశభవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందనీ, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను మూడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా అందరూ జరుపుకోవాలని రాష్ట కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గంలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి మల్లారెడ్డి మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 8 ఏండ్లలో అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, రైతులకు కోట్లాది ఎకరాలకు సాగు నీరు, దళితులకు దళితబంధు, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ, యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ, రైతుబంధు రైతుబీమా, రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరికీ అబ్ది చేకూరిందన్నారు. నేడు గిరిజనుల పండగ అనీ, వారి కోసం హైదరాబాద్‌లో రూ.53 కోట్లతో నిర్మించిన బంజారా భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ చదువు కు ఎంతో ప్రాధాన్యతనిస్తారని తెలిపారు. ఈ విషయంలో పేదలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉన్నత చదువులు చదివేందుకు, విదేశీ చదువులు అభ్యసిం చేందుకు ఉచితంగా విద్యనందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ విద్యను అందజేస్తున్నామనీ, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రతి పనినీ లీనమై చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను చేపట్టిన విషయాల గురించి మంత్రి మల్లారెడ్డి విద్యార్థులకు వివరి ంచారు. జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ 2014లో ప్రత్యేక ఏర్పడిందనీ, 8 ఏండ్లలో రాష్ట్ర త్వరితగతిన అభివృద్ధి చెందుతోందన్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో 75వ వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం పచ్చదనంలో దేశంలోనే మొదటి స్థా నంలో ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్మెన్ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ హక్కుల కోసం అనేకమంది పోరాడారనీ, వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధనలో భాగంగా రాష్ట్రం ఏర్పడిన అనంతరం దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రం రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. సమావే శానికి ముందు కళాకారుల డప్పు వాయిద్యాలు, ఆటపా టలు, విద్యార్థుల డ్యాన్స్‌లు, కేరింతలు, బోనాల ఊరేగింపు, జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మారుమో గింది. ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సందీప్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా ఇంటర్మీడ ియట్ అధికారి కిషన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొ రేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, పోలీస్ శాఖ సిబ్బంది, విద్యార్థులు, యువతి, యువకులు, మహిళలు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.