Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీ రామ్ నాయక్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరులను కించపరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరామ్ నాయక్ హెచ్చరించారు. శుక్రవారం సుందరయ్య పార్కులోని, సుందరయ్య విగ్రహం వద్ద సాయుధ పోరాట యోధులకు జోహార్లు అర్పిం చారు. అనంతరం శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్స వాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అమరులను స్మరిస్తూ గిరిజన తండాలు, గూడేలలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వాన జరిగిన పోరాటంలో పోరాట యోధులు అమరులయ్యారని గుర్తు చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జరిగిన సాయుధ రైతాంగ పోరులో గిరిజనులు, పేదలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పారు. ఆ పోరాట ఫలితంగా లక్షలాది ఎకరాల భూములపై పేదలకు హక్కు లు కల్పించబడ్డాయన్నారు. దొరలు, జాగీర్దార్లు, రజాకార్లు, పటేల్ సైన్యాల ఆగడాలకు దొడ్డి కొమురయ్య, వీరనారి ఐలమ్మ, జాటోత్ ఠానూనాయక్, షేక్ బందగీ, షోయాబుల్లాఖాన్, వాచ్యా, భీమ్లా, సోయం గంగులు, చెంచురామయ్య, కోయ వెంకటమ్మ, లంబాడి భాషు, భూక్య బాల్యా వంటి ఎందరో వీరులు అమరులయ్యారని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ సాయుధ పోరాట స్ఫూర్తిని నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సెప్టెంబర్ 17న విలీనం, విమోచనం, సమైక్యతా దినం అంటూ ఎవరెన్ని వేషాలు వేసినా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వం మాత్రం కమ్యూనిస్టులకే దక్కుతుంద న్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నాయనీ, అమరులను అవమాన పరిచేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అమరుల ను కించపరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మనాయ క్, ఆర్.శ్రీరాంనాయక్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎం.బాలు నాయక్, అధ్యక్షులు వి.రాంకుమార్, కృష్ణ, కిషన్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, జనసేన నాయకులు జానావత్ శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు.