Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రయివేటు ల్యాబులు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ వికిటిమ్స్ ఫోరమ్ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. ఆదివారం విజయ డయాగ్నోస్టిక్, ల్యూసీడ్, తపడియా, అప్రొకేర్, డీబీర్, కోనార్క్, కనెక్ట్, తదితర ల్యాబ్‌లకు వినతిపత్రాలను పబ్లిక్ హెల్త్ వికిటిమ్స్ ఫోరమ్ అడ్వొకేట్ సభ్యులు మల్లేష్, రాంమోహన్ రెడ్డి, బాల్‌రెడ్డితో కలిసి అందజే శారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కొన్ని రోజు లుగా రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా, డెంగ్యూ, వైరల్ వ్యాధులతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా చాలా మంది ప్రజలు హాస్పి టల్స్కి వెళ్తే డాక్టర్లు రక్త పరీక్షలు, మూత్రం, వివిధ రకాల పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. హాస్పిటల్స్ ల్యాబ్‌లో కానీ బయట వివిధ డయాగోనిస్టిక్ సెంటర్ లోకి వెళ్తే నిలువు దోపిడీలు చేస్తున్నారని తెలిపారు. అక్కడి ల్యాబ్ ఎంట్రన్స్‌లో ధరలు పట్టిక పెట్టాలనీ, ప్రజల దగ్గర ఏ రేట్లు తీసుకుంటున్నాం అనేది ఆయా హాస్పిటల్స్, ల్యాబ్ వారు జిల్లాల్లోని జిల్లా వైద్య అధికారులకి ఇచ్చిన అపెండెక్స్-3 ప్రకారం ప్రభు త్వంకి ఇచ్చిన రేట్లు ప్రకారం తీసుకోవాలని తెలిపారు. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదన్నారు. వారికి నచ్చిన విధంగా ఎక్కువ .మొత్తంలో తీసుకుం టున్నారనీ, న్యాయపరంగా వారికి వినతిపత్రాలను అం దజేసినట్టు తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వానికి విరు ద్ధంగా ల్యాబ్‌లలో రేట్లు వసూలు చేస్తే వారిపై న్యాయ పరంగా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.