Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఈసీఐఎల్ కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకునిగా పని చేసిన సీహెచ్.మధుసూదన్ రావు అకాల మరణం కార్మిక వర్గానికి తీరని లోటని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీ యూసీ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్. బోస్ అన్నారు. ఏఐటీయూసీ కాప్రా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో మధు సూదన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీఎస్. బోస్ మాట్లా డుతూ నికార్సైన కార్మిక నేతగా మధుసూధూన్ మంచి పేరు గడించాడని గుర్తుచేశారు. తోటి కార్మికుల సమస్యలపై స్పందించి వాటి పరిస్కారానికి రాజీలేకుండా శ్రమించిన నేతగా ఉన్నారన్నారు. 1967లో కంపెనీలో ఉద్యోగిగా అరంగ్రేట చేసి 1983 ఆఫీస్ బేరర్‌గా, వర్క్ మెన్‌గా, ఆఫీసర్ క్యాటగిరీ వరకు వివిధ హౌదాలలో కొనసాగారని తెలిపారు. కార్మిక నేతగా కొనసాగుతూనే సీపీఐలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జి.దామోదర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.శంకర్ రావు, ఏఐటీయూసీ కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు సాంబశివరావు, మోహన్ రావు, రాజేశ్వర్ రావు, వెంకటేశ్వర రావు, జీవీఆర్ ప్రసాద్, ఐఎస్. రావు, సూర్యప్రకాష్, ఎస్ఎస్ ఆర్ కె శాస్త్రి, సుధాకర్, నర్సింహా, జోషి, భిక్షపతి, ఏఐవైఎఫ్ రాష్ట్ర నేతలు కె.ధర్మేంద్ర, టి.సత్య ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.