Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతి నగర్లోని జీపీఆర్ లేఅవుట్ రెండవ డివిజన్లో దాదాపు 30 వరకు కొత్త అపార్ట్మెరట్లు నిర్మాణం అనుమతులు ఇచ్చిన కార్పొరేషన్, భవన నిర్మాణాలు పూర్తయిన కనీసం వీధులకు స్ట్రీట్ లైట్లు లేకపోవడం శోచనీయమని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కనీసం అపార్ట్మెంట్ నుండి వచ్చే డ్రైనేజ్ వ్యవస్థకు అనుకూలంగా డ్రైనేజ్ లైన్లో లేకపోవడం-మట్టి గుంతల మాయమైన రోడ్లు ముఖ్యంగా మెయిన్ రోడ్డు నుంచి లహరి రిసార్ట్ రోడ్డు మొత్తం గుంతల మయమైంది. అంతేకాకుండా సర్వే నెంబర్:136 పార్కును అభివద్ధి చేయాలి, విఎన్ఆర్ కాలేజ్ నుంచి డ్రైనేజీని జీపీఆర్ లే ఔట్లోకి వదలడం సర్వేనెంబర్ 134 నందు ఎర్రగుంటని అభివద్ధి పరచడం, అలాగే తాగునీరు పైప్లైన్ వంటి సమస్యలను ఆదివారం కాలనీ ప్రజలతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలతో సమావేశమై పరిష్కారానికి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్ మాట్లాడుతూ అడ్డదిడ్డంగా అనుమతులిచ్చి మౌళికవసతుల కోసం హెచ్ఎండిఎ మున్సిపల్ అధికారులు భారీగా ట్యాక్సు వసూలు చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ, కనీస వసతులు కల్పించడంలో శ్రద్ధలేదని, ఒకవేళ వారం రోజుల్లో జీపీఆర్ లేవు మౌలిక వసతులు కల్పన కోసం నిధులు కేటాయించి పనులు చేపట్టకుంటే వచ్చే శనివారం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నుండి కాలనీ ప్రజలతో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటిలెచ్యువల్ ఫోర్ కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రమౌళి, ఇతర నాయకులు మురళీకృష్ణ, శివరామకృష్ణ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.