Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
విద్యార్థులు చెడుదోవ పట్టకుండా మంచి మార్గంలో నడవాలని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉపాధ్యా యులకు, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మీర్‌చౌక్ ట్రాఫిక్ సీఐ అసబుళ్ల సూచించారు. సామాజిక కార్యకర్త ఆర్టీఐ రక్షక్ సొసైటి తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాపోలు లింగ స్వామి ఆధ్వర్యంలో తన కుమారుని 10వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శనివారం రాత్రి చంపాపేట్‌లోని మైనారిటీ గురుకుల్ పాఠశాల యకత్పుర బార్సు 2లో పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మీర్‌చౌక్ ట్రాఫిక్ సీఐ అసబుళ్ల, కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మెన్ చెన్నోజు శ్రీనివాసులు, ఆర్టీఐ రక్షక్ సొసైటీ గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య సలహాదారులు మామిళ్ల సత్తిరెడ్డి, హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లుతో కలిసి విద్యార్థుల మధ్యన కేక్ కట్ చేసి అరటిపండ్లు, పెన్నులు, బిస్కెట్లు దాదాపు 200 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీఐ కార్యకర్తగా సమాజానికి తన వంతు సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పదని, సమాజ సేవ చేయాలనే ఆలోచన కొందరికే ఉంటుందని, విద్యార్థులకు పండ్ల పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్‌గా ఎదో ఒక సేవా కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న లింగస్వామికి శాలువాలతో ఘన సన్మానం చేశారు. రాపోలు లింగస్వామి మాట్లాడుతూ సమాజ సేవ కోసం నిరంతరం కషి చేస్తానని తెలిపారు. సేవ చేయడంలోనే తనకు ఆనందం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ సొసైటీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జీ పగడాల దేవయ్య,రాము, మహేష్, నాగ మల్లేశం, టేకుమాట్ల యాదగిరి, సైదులు, రేణుక, లలిత, గీత, లక్షమ్మ, బిక్షమయ్య, శ్రీకాంత్, శశికాంత్, సౌభాగ్య, కార్తీక్, జావిద్, తదితరులు పాల్గొన్నారు.