Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగా-ఎల్బీనగర్
సరూర్నగర్ మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం మూడవ మహాసభలు దిల్సుఖ్నగర్లోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం యూనియన్ అధ్యక్షులు ఎస్.రామ్మోహన్, కార్యదర్శి జి.కురుమయ్య హాజరై మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ కార్డు వలన మనకు ఎంతో ఉపయోగపడుతుంది అని, ప్రమాదంలో మరణిస్తే ఆరు లక్షల 30000, సహజ మరణం అయితే ఒక లక్ష 30వేలు, ప్రమాదవశాత్తు పూర్తి శాశ్వత అంగవైకల్యం కలిగినవారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం, ప్రమాదవశాత్తు పాక్షిక శాశ్వత అంగవైకల్యం కలిగినవారికి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది అన్నారు. వివాహ కానుక రూ.30వేలు, ప్రసూతి సహాయం 30వేల రూపాయలు లేబర్ ఆఫీసర్ నుండి కార్మికులకు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. కార్మికుల నుండి సెర్చ్ రూపంలో లేబర్ ఆఫీస్లో జమ అవుతాయి అని, ఇతర రాష్ట్రాల కార్మికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. మన రాష్ట్రంలో కల్పించకపోవడం వలన కార్మికులకు నష్టం జరుగుతుంది అన్నారు. కార్మికులంతా ఐక్యంగా ఏర్పడి మనకు రావలసిన లేబర్ ఆఫీసు నుండి సౌకర్యాలను పోరాటం ద్వారా తెచ్చుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సీిఐటీయూ ఉపాధ్యక్షులు కే.నర్సిరెడ్డి, ఎల్బీనగర్ సీిఐటీయూ కన్వీనర్ ఎ.ఎల్లయ్య, సర్కిల్ కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. సరూర్నగర్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం యూనియన్ అధ్యక్షులుగా మల్లె పాక వీరయ్య, ప్రధాన కార్యదర్శిగా గోకమల్ల చైతన్య, ఉపాధ్యక్షులుగా మేకల కష్ణ, వి.వెంకన్న, టి.బాలస్వామి, సహా కార్యదర్శులుగా సి.నవీన్, డి.మల్లేష్, ఎండి లతీఫ్, కోశాధికారిగా బి.పరుశరాములు, కమిటీ సభ్యులుగా ఉదరు కుమార్, వెంకటేష్, నల్లాల వెంకటయ్య, ఎల్.శంకర్, వి.ఎల్లయ్య, కె.చంద్రయ్య, డి.రవి, ఎం.యాదగిరిలను ఎన్నుకున్నారు.