Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
కవులు, కళాకారులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపుని స్తుందని చంపాపేట్ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నల్ల రఘుమారెడ్డి అన్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా చంపాపేట్ డివిజన్ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని న్యూ పద్మానగర్ కాలనీ సంక్షేమ సంఘ భవనంలో ఆదివారం కవులు, కళాకారు లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్ల రఘుమారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
ఈ సందర్భంగా కళాకారులను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్ర మంలో టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, మహిళా అధ్యక్షురాలు రోజా రెడ్డి, గోకుల్ సరోజ, మేక సురేందర్ రెడ్డి, గౌరీదేవి రాజు, అంజిరెడ్డి, గోగు శేఖర్‌రెడ్డి, నరేష్, కాలనీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్‌రెడ్డి, నాగబండి నగేష్గుప్తా, కట్ట వెంకటేష్, మాధవి రెడ్డి వసంతరెడ్డి, బొడ్డు కనకేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.