Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకులు ఎర్రం శ్రీనివాస్
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ జీహెచ్‌ఎంసీి సర్కిల్ పరిధిలో రామంతపూర్ చిన్న చెరువులో గల ఓపెన్ జిమ్ ఏర్పాటుచేసి మూడు సంవత్సరాలు కావస్తోంది. అక్కడ వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) నాయకులు ఎర్రం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఓపెన్ జిమ్‌కు రోజుకు సుమారు వందలాది మంది వస్తూ, వెళ్తూ ఉంటారు. ఓపెన్ జిమ్ మెయింటెనెన్స్ లేక చాలా పరికరాలు బేరింగ్ పోయి పాడైపోయాయి, కాబట్టి ఆరోగ్యం కాపాడుకొనుటకు ఇక్కడికి వచ్చేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులకు, పాలకులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా వ్యాయామశాలను బాగుచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అక్కడికి వచ్చే వారు ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి వ్యాయా మశాలను వెంటనే బాగుచేయాలని వారు డిమాండ్ చేశారు.