Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
నవతెలంగాణ-బడంగ్పేట్
తెలంగాణ రాష్ట్ర అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని, పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శ నలో ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులను మంత్రి ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి మారి 75ఏళ్ళలోకి అడుగిడుతున్న సందర్భం గా ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజులపాటు తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చార న్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి త్యాగాలను స్మరించ ుకోవాలి.. చరిత్ర భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని, లేకుంటే నేడు సమాజంలో వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్ట డానికి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించిన అధికారులను అభినందించారు. అదేవిధంగా విజయవంతం చేసిన ప్రజలకు, యువత, విద్యార్థులు, మహిళలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజుల ఉత్సవాలలో భాగంగా భారీగా నిర్వహించిన ర్యాలీలలో పాల్గొని సమైక్యతా వాదాన్ని వినిపించిన పాఠశాలల విద్యార్థులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ ఎవరి సొత్తు కాదని, అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని, నేడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపించారని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో అద్భుత ప్రదర్శన చేసిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కవులు, కళాకారులు, అక్షర యోధుల పోరాటాలు, కొమురం భీం, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి లాంటి మహానుభావులు వివిధ అంశాల మీద చేసిన పోరాటాలు ఎన్నటికీ మరిచిపో వొద్దన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా దేశం అంతామూడు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తే తెలంగాణలో వజ్రోత్సవాలను 15 రోజులపాటు నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించారని, ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో 8 ఏళ్లలో సమూల మార్పులు వచ్చాయని, వేసవిలో నీటి కోసం ఇబ్బందులు ఉండేవని నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటకీి మిషన్ భగీరథ పథకం ద్వార నల్లాలు ఏర్పాటు చేయడంతో జలకళలు వచ్చాయ న్నారు. పేద ప్రజల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్, దళిత బంధు, పెన్షన్లు, తదితర సంక్షేమ పథకాలకు తెలంగాణ చిరు నామా అయిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 8ఏళ్ల కాలంలో పెట్టు బడులు వెల్లువలా వస్తున్నాయని, ప్రయివేటు రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని, 80వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ దయానంద్, కలెక్టర్ అమోరు కుమార్, అడిషనల్ కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.