Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాల్ ఆటో యూనియన్
- కార్మికులకు న్యాయం జరిగేవరకు సీిఐటీయూ అండ
నవతెలంగాణ-ఉప్పల్
మా బ్రతుకులను రోడ్డుపాలు చేస్తారా?, పొట్టకూటి కోసం రాత్రి, పగలు తేడా లేకుండా ఆటో నడుపుతు జీవనం కొనసాగిస్తున్న, ఆటో యూనియన్ అడ్డాను తొలగి స్తారా అంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో విశాల్ ఆటో యూనియన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఉప్పల్ కార్యదర్శి జె.వెంకన్న మాట్లాడుతూ రామంతపూర్ విశాల్ ఆటో యూనియన్ సుమారు 60 మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈ అడ్డాలో గత 20సంవత్సరాలుగా ఉంటున్నాం, మెయిన్ రోడ్ నుండి స్థానిక కాలనీలకు వెళ్లే ప్రయాణికు లను సురక్షితంగా తీసుకువెళ్తుంది. ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు అధికారులకు కంప్లయింట్ చేశారు. ఆటో అడ్డాను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఆటో అడ్డా లేకపోతే 60 కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరి కొరకు ఆటో అడ్డాను తొలగించడం న్యాయం కాదని, మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ గౌస్, ఆటో యూనియన్ నాయకులు యాదగిరి, వెంకటేష్ పాండు, శివకుమార్, సంతోష్, రాము, అరుణ్, జగన్, ఫైసల్, అంజన్న, బాలాజీ, సంజీవ ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.