Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సంగీత ప్రపంచంలో సుబ్బలక్ష్మి శిఖరం వంటి వారని ఎమ్మెల్సీ మధుసూదనాచారి కొనియాడారు. సాగర్ రోడ్లోని ఎస్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ప్రముఖసాంస్కృతిక సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో విఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎంఎస్ సుబ్బక్ష్మి జయంతి సభ ఆదివారం జరిగింది. మధుసూదనాచారి పాల్గొని సుబ్బలక్ష్మి పేరిట ఏర్పరచిన సంగీత పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం సంగీత విభాగం అధిపతి రాధా సారంగపాణికి బహుకరించి మాట్లాడుతూ భరత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారతరత్న పొందిన సుబ్బలక్ష్మి గాంధీజీ మెచ్చిన గాయని అన్నారు. రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ సుబ్బలక్ష్మి పేరిట పురస్కరం ప్రముఖ సంగీత గురువు రాధా సారంగపాణికి బహుకరించటం ముదావహమన్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ దైవదత్తమైన స్వరం సుబ్బలక్ష్మిది అని కొనియాడారు. ఆకతి సుధాకర్ అధ్యక్షత వహించిన సభలో నరసింహరెడ్డి, దినకర్, వెంకటేశ్వర రాజు సత్యనారాయణ, ప్రహ్లాద్, చక్రపాణి పాల్గొన్నారు.