Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్
హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మార్నింగ్‌లో భాగంగా డివిజన్లోని తిరుమల కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల వర్షపు నీరు, ట్రంక్‌లైన్ పనులను వల్ల వర్షపు నీరు వెళ్లడానికి సరైన కాలువలేక వర్షాపు నీరు ఖాళీ ప్రదేశాల్లో చేరి కాలనీలో విపరీతమైన దోమలు, దుర్వాసనతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్‌కి కాలనీ వాసులు వివరించారు. వెంటనే అధికారులతో మాట్లాడి వర్షాపు నీరు వెళ్లే విధంగా తాత్కాలితమైన కాలువను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు వీరస్వామి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.