Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
- స్వాతంత్య్ర సమరయోధుడికి సన్మానం
నవతెలంగాణ-అంబర్‌పేట
తెలంగాణ జాతీయ సమైక్యతా స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. వజ్రోత్సవాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సమైక్యతా స్ఫూర్తిని చాటడం గొప్ప విషయమన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా బాగ్‌అంబర్‌పేట డివిజన్ శారదానగర్‌లో నివాసముండే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది సాయిని వెంకటేశంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయిని వెంకటేశం ఒక స్వాతంత్ర సమరయోధుడిగా తనకు వచ్చే పింఛను చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తుండడం అభినందనీయమన్నారు. సేవాభావం గల వ్యక్తి తన నియోజకవర్గంలో ఉండటం తన అదష్టమని, ఆయనను వజ్రోత్సవాల్లో భాగంగా సన్మానించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. దేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న రోజును పురస్కరించుకొని ప్రభుత్వం మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా వజోత్సవాలను ఘనంగా నిర్వహించిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏ మాత్రం సంబంధం లేని కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన పేరిట మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నాయని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వజ్రోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో శారదానగర్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు శేఖరయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, రత్నాకర్, రామకష్ణ, బాబు, గోపీ, విక్రమ్, సుబ్బరాజు, శ్రీనివాస్, రాము, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, శ్రీరాములు ముదిరాజ్, కనివేట నర్సింగ్‌రావు, ఎస్.ధనుంజయ, పంజాల చంద్రశేఖర్, మిర్యాల రవీందర్, టైప్ శ్రీనివాస్, శరత్, శివాజీయాదవ్, కె.శ్రీనివాస్, రమేష్ నాయక్, దారయోబు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.