Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవులు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించడం గర్వకారణం
- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగాయనీ, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కృషి చేశారని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మేడ్చల్-మల్కాజి గిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని కవులు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధులను మంత్రి మల్లారెడ్డి శాలువాలు, పూలమాలలు, ప్రశంసాపత్రాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో మొదటి భాగంగా 16న మేడ్చల్ వద్ద ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 20 వేల మంది పాల్గొన్నారని తెలిపారు. 17న ఎన్టీఆర్ స్టేడియం వద్ద జరిగిన ముఖ్యమంత్రి సమావేశానికి లక్ష మంది ప్రజలు హాజరయ్యారన్నారు. రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారనీ, వారిని అభివృద్ధి పథంలో పయనింపచేసేందుకు గిరిజనబంధు కార్యక్రమాన్ని సైతం ప్రారంభించడం సీఎంకు వారి పట్ల ఉన్న అభిమానానికి నిదర్శమన్నారు. ఈ వజ్రోత్సవాలను విజయవంతం చేయడంలో జిల్లా కలెక్టర్ హరీశ్‌తోపాటు అదనపు కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగం, సిబ్బంది కృషి ఎంతో అభినందనీయ మన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుంచా మన్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఉత్సవాల్లో చివరి రోజున జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను గుర్తించి వారిని సన్మా నించడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందనీ, మరింత అభివృద్ధి పథంలో తీసు కెళ్ళేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా పరిషత్ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ వజ్రోత్సవాలు జిల్లా వ్యాప్తంగా విజయ వంతమయ్యాయని తెలిపారు. ఉత్సవాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు అందరినీ ఉత్సాహపర్చాయని పేర్కొ న్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, డీఈవో విజయకుమారి, కలెక్ట రేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య, జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కతిక కార్యక్రమాలు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో చివరి రోజు ఆదివారం విద్యార్థులు, కళాకారులు నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అహుతులను అలరించాయి. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ఏకపాత్రాభిన యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డిని మంత్రి మల్లారెడ్డి, జెడ్పీ ఛైర్మన్ శరత్‌చంద్రారెడ్డి అభినందించారు. కళాకారులు ముఖ్య అతిథులను కళారీతులతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. చిందు, యక్షగానం, నాటిక, దేశ భక్తి, తెలంగాణ గేయాలతో కళాకారులు, తెలంగాణ వీరుల పోరాట స్ఫూర్తిని కండ్లకు కట్టినట్టు విద్యార్థులు నాటికలు ప్రదర్శించి అలరింపజేశారు. చిన్నారులు తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ వేడుక ప్రాధాన్యతను నృత్య రూపకంగా చాటారు.