Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
నియోజకవర్గంలోని గౌతమ్ నగర్లోని ఇందిరా నెహ్రూ నగర్ కాలనీ హిల్ చర్చ్ సహకారంతో గ్లోబల్ రిస్టార్ లవ్ ప్రాజెక్టు వారు శనివారం ఉచిత మహిళా వైద్య శిబిరం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా హిల్ చర్చ్ పాస్టర్ రెవబక్క ఏలీయా మాట్లాడు తూ నేడు సమాజంలో మహిళాలు అనేక రుగ్మతలతో బాధపడుట్జున్నార న్నారు. సరైన పౌష్టికాహారం లేక అనేక రోగాలతో, నొప్పులతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో మానసిక స్టార్యని నింపేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్య్రక్రమంల్ హై కోర్ట్ న్యాయవాది ఆనంద గ్లోరి మహిళలకు న్యాయ పరమైన సహాలను అందించారు. 200 మంది మహిళలు పాల్గొన్న కార్యక్రమంలో బీపీ, షుగర్, కండ్ల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందచేశారు. ఈ శిబిరంలో డాక్టర్ అభిషేక్, డాక్టర్ రిబ్కా, డాక్టర్ డేవిడ్, బిషప్ అహరోను, పాస్టర్ సంజీవ్ కుమార్ కొఠారి, పొలిపాక దానియేలు, బొమ్మకంటి ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.