Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
ప్రభుత్వ సంక్షేమ పథకాలను జర్నలిస్టులో సద్విని యోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలి స్టుల సంఘం మేడ్చల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డమీది బాలరాజు కుత్బుల్లాపూర్ నుంచి జిల్లా కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జర్నలిస్టులో ఆదివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలివరు. ఈ సందర్భంగా ఆయన నూతన కమిటీ సభ్యులను సత్కరిం చారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో జర్నలిస్టులను భాగస్వామ్యులను చేయడంతో తాను ముందు ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వపరంగా జర్నలిస్టుల హక్కుల కోసం తాను ఎప్పుడూ చర్చిస్తూనే ఉంటున్నానని స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నిర్మాణం వేగవంతంగా చేపట్టాలని సూచించారు. అందుకు కావాల్సిన నిధులను ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా అందిస్తానని మరో మారు స్పష్టం చేశారు. ఆరోగ్య భద్రత, విద్యా, నివాస స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రభుత్వాలు ఇచ్చే జీవోలను కుత్బుల్లా పూర్ జర్నలిస్టులకు అమలు చేసేలా పనిచేస్తానని హామీనిచ్చారు. పత్రికేయులకు ప్రజా ప్రతినిధులకు మధ్య సత్సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుంటూరు శేఖర్, కె.వెంకట్, నాగేంద్ర చారి, నరేందర్ రాజు, దయాకర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి.సాయి బాబా, కోశాధికారి శేషారెడ్డి పాల్గొన్నారు.