Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి
- పారిశుధ్య సిబ్బందికి డస్ట్‌బిన్, హెల్త్ కిట్లు పంపిణీ
నవతెలంగాణ-ఓయూ/జూబ్లీహిల్స్
కార్మికుల క్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి అన్నారు. సోమవారం తార్నాకలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద శానిటేషన్ సిబ్బందికి పీపీఈ కిట్లు, వ్యక్తిగత సంరక్షణ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యోదయం కంటే ముందే నగరాన్ని అనునిత్యం శుభ్రపరుస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుధ్య కార్మికులు అభినందనీయులు అని కొనియాడారు. ప్రజలు శానిటేషన్ సిబ్బందికి సహకరిస్తూ ఎక్కడపడితే అక్కడ చెత్తను వేయకుండా డస్ట్బిన్లను ఉపయోగించాలని కోరారు. నిరంతరం పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకొని వారికి మాస్కులు, కొబ్బరినూనె, షూస్, శానిటైజర్‌తో కూడిన కిట్లను అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, ఏఎంఓహెచ్ రవీందర్ గౌడ్, శానిటేషన్ సూపర్వైజర్ ధన గౌడ్, శానిటేషన్ విభాగ అధికారులు, సీనియర్ నాయకులు ఖాజా పాషా, యాకూబ్ అలీ, సాయి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
హబ్సిగూడ డివిజన్ వార్డ్ కార్యాలయంలో కార్పొరేటర్ చేతన హరీష్ శానిటేషన్ సిబ్బందికి డస్ట్బిన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు చందన, రంజేశ్వర్ రెడ్డి, రాంకీ ఇన్చార్జ్, సీనియర్ నాయకులు సంజరు పటేల్, సుమన్‌రావు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో..
జీహెచ్ఎంసీ సర్కిల్ 19 పరిధిలోని సుమారు 800 మంది పారిశుధ్య కార్మికులకు వెంగళరావునగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ వద్ద సేఫ్టీ పరికరాలను, హెల్త్ కిట్లను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రమేష్, మెడికల్ ఆఫీసర్ బిందు భార్గవి, శానిటరీ ఇన్స్పెక్టర్ విజరు కుమార్, ఈఈ రాజ్ కమార్, రామ్‌కి సంస్థ సర్కిల్ ఇన్చార్జి చంద్రశేఖర్, కార్పొరేటర్లు దేదీప్య, రాజ్ కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి పాల్గొన్నారు.