Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కిర్గిస్తాన్ మెడికల్ యూనివర్సిటీ పేద విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో వైద్యవిద్యను సాకారం చేస్తుందని వింగ్స్ కన్సల్టెన్సీ సీఈఓ భాను ప్రకాష్ అన్నారు. సోమవారం అమీర్‌పేటలోని సితార హోటల్లో జరిగిన సమావేశంలో యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ వైద్య విద్య కోసం కోట్లు ఖర్చు చేయాల్సిన పనిలేకుండా అతి తక్కువ ఖర్చుతో, అత్యున్నత ప్రమాణాలతో మీ స్వప్నాన్ని సాకారం చేసుకునే సదవకాశాన్ని దశాబ్దాల చరిత్రకలిగిన కిర్గిస్తాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కల్పిస్తోందని తెలిపారు. అనేక మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుని తమ వైద్యకళాశాలలో తీర్చిదిద్దుకున్నారని చెఆబీప్పరు. వారిలో ఎందరో ఇప్పుడు ఇండియాలో తమ పవిత్ర వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చెప్పారు.