Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
నవతెలంగాణ-బంజారాహిల్స్
అక్రమ కేసులు రాజ్యాంగ ఉల్లంఘనే అని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రఫిక్ హమ్మద్ అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము బోధిస్తున్న విద్యలో ఉగ్రవాదాన్ని జోడించడం సమంజసం కాదన్నారు. తమ సంస్థలకు ముందస్తుగా నోటీస్ ఇస్తే ఎక్కడికైనా వస్తామన్నారు. నోటీస్ ఇవ్వకుండా దాడులు ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వమనీ చెప్పి ఇలాంటి దాడులు చేయించడం హేయమైన చర్య అని అభివర్ణించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల అనుసారంగా నిరసన తెలుపుతామనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. సమావేశంలో ఉల్మ ప్రతినిధి వలీవుల్లా, మౌలానా అబ్దుల్ వహీద్ తదితరాలు పాల్గొన్నారు. కాగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థపై ఎన్ఐఏ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 43 చోట్ల దర్యాప్తు ప్రారంభించింది. మార్షల్ ఆర్ట్స్ నేర్పే ఈ సంస్థకూ తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని ఎన్ఐఏ, కొందరినీ అదుపులో తీసుకొని సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు.