Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ను త్వరలో అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు హర్షం వ్యక్తంచేశారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గిరిజనబంధు, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. 10 శాతం రిజర్వేషన్ పెంపుతో గిరిజన కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు భూక్య రవి డా.రవితేజ నాయక్, బాదావత్ లక్ష్మణ్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు చందు రమేష్, వినోద్, వెస్లీ, సంతోష్, తిరుపతి పాల్గొన్నారు.