Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం గోల్నాక డివిజన్ దుర్గానగర్‌లో పలు శాఖల అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కొత్త రహదారి ఏర్పాటులో జాప్యం జరుగుతోందని ఈసందర్భంగా వారు ఎమ్మెల్యే దష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గానగర్ అమ్మవారి గుడి ప్రధాన రహదారితో పాటు పక్కనే ఉన్న రెండు బస్తీల్లో వెంటనే రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి నవరాత్రుల వేడుకలకు ముందే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, జలమండలి జీఎం శ్రీధర్‌రెడ్డి, మేనేజర్ రోహిత్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్‌తో పాటు బస్తీ నాయకులు పాల్గొన్నారు.