Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
- సైంటిస్టులతో ప్రత్యేక సమావేశం
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న పోషకాహార లోపం సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. సోమవారం తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్్ఐఎన్), ఐసీఎంఆర్ సైంటిస్టులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ రాష్ట్రంలో మాల్ న్యూట్రీషియన్ సమస్యను అధిగమించడానికి సైంటిస్టులు, గైనకాలజిస్టులు కలిసి వర్స్షాపును నిర్వహించాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల తెలంగాణలోని మూడు జిల్లాలోని ఆరు గ్రామాల్లో ట్రైబల్స్కు స్థానికంగా లభించే ఇప్పపువ్వు ద్వారా ఎన్ఎస్ఐఎన్ శాస్త్రవేత్తలు తయారు చేసిన లడ్డును (మహువ లడ్డు) ఆహారంగా ఇచ్చారని తెలిపారు. తద్వారా అక్కడి మహిళల్లో, పిల్లల్లో హెచ్ఐ గణనీయంగా పెరిగిందన్నారు. దీనిని రాష్ట్ర మంతటా అమలు చేయాలని గవర్నర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటుగా చిక్కీ, మునగాకు, మునగకాయలో చాలా పోషకాలు ఉన్నాయనే విషయం ప్రజలకు తెలియడం లేదన్నారు. వీటిపై ప్రజల్లో విస్తతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత, సైంటిస్టులు డా. లక్ష్మయ్య, శ్రీనివాసరావు, ఉదరు కుమార్ పాల్గొన్నారు.