Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ఉద్యోగుల కోసం నిరీక్షిం చకుండ స్వయం ఉపాధి రంగాలను ఎంచుకుని రాణించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎంఆర్డీసీ చైర్మెన్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం కర్మన్‌ఘాట్ మ్యాక్స్ లైఫ్ పక్కన ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన విశాల్ మెగా మార్ట్‌ను ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నాగిళ్ళ వాస్తవ్యులు అడ్వకేట్ రాజేశ్వర్‌రెడ్డి నిర్వాహకులతో కలిసి ప్రారంభిం చారు. అనంతరం నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నాణ్యమైన అన్ని రకాల నూతనంగా ప్రజలకు అందు బాటులో ప్రత్యేకత ఉండాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగు ణంగా నూతన వెరైటీలను అందించి ప్రజల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. పరిశుభ్రతమైన నాణ్యత గల జాగ్రత్త పాటించాలన్నారు.
అభివృద్ధి చేందలంటే మారుతున్న కాలాను గుణంగా కష్టపడి పురోగతి చెంది వినియోగదారులకు మంచి సేవలు అందించినప్పుడే వినియోగదారులు ఎల్లప్పుడూ మీ సేవ సౌకర్యాలు అందుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, పెద్దలు, అభిమానులు, యువకులు పాల్గొన్నారు.