Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ కుంట్లూర్ 12 వ వార్డులో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీి రోడ్డు, 20 వ వార్డులో 6 లక్షల నిధులతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులకు చైర్ పర్సన్ స్వప్న, వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డిలు కౌన్సిలర్స్ పబ్బతి లక్ష్మణ్, జోర్క గీత శ్రీరాములుతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణీ కరణ అభివృద్ధిలో భాగంగా 12వ, 20వ వార్డులల్లో అభివృద్ధికి తమవంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే పదహారు లక్షల నిధులతో చేపట్టిన సిసి రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అలాగే కాలనీలో మౌలిక సదుపా యాల కల్పన కృషిచేనున్నట్లు తెలిపారు. దశల వారిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుటకు మరింత పారదర్శకంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ రామాంజులరెడ్డి, డిఈఈ అశోక్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి ,నాయకులు కోటయ్య, కాంట్రాక్టర్ లింగస్వామి, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.