Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎన్జీ గ్యాస్ కోసం వచ్చే వాహనదారులకు తప్పని తిప్పలు
నవతెలంగాణ-సంతోష్‌నగర్
సైదాబాద్ మండలం ఎదురుగా ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని చౌరస్తా వద్ద అటుగా సీఎన్జీ గ్యాస్ కోసం వచ్చే వాహనాలు పార్కింగ్ ఉండడంతో చౌరస్తా వద్ద రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. చంపాపేట్ సిగల్ నుంచి డి మార్ట్, భారత్ గార్డెన్, చిన్న చిన్న వాణిజ్య వ్యాపారుస్తులు అమ్మకాలు కొనసాగించే ప్రాంతాలలో వాహనాలు పార్కింగ్ ప్లేస్ లేక రోడ్డు మీదే ఆపేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేవలం సాయంత్రం జూడో పెట్టి ముక్కుపిండిస్తుంటారు. ఐఎస్ సదన్ చౌరస్తా కల్వకుర్తి బస్టాప్ వద్ద వచ్చే వాహనాలకు తనిఖీలు చేపట్టడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. ప్రభుత్వంకు ఖజానా నిండటం కావాలి కానీ, ట్రాఫిక్ ఇబ్బంది పట్టదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు నిత్యం ట్రాఫిక్ లేకుండా చూడాలని వాహన దారులు, విద్యార్థులు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతున్నారు.