Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి
నవతెలంగాణ-తుర్కయాంజల్
దశలవారీగా మున్సిపాలిటి అభివృద్ధికి కృషి చేస్తానని తుర్కయంజాల్ మున్సిపాలిటి చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి పేర్కొన్నారు. సోమ వారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి ఇంజాపూర్ 24 వ వార్డు ఆపిల్ లెవెన్యూ కాలనీలో రూ.15 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్లతో కలిసి చైర్పర్సన్ అనురాధ రాంరెడ్డి ప్రారంభిం చారు. అనంతరం మన్నెగూడ 8వ వార్డు సిరి టౌన్షిప్ కాలనీలో రూ.13 లక్షల వ్యయంతో పట్టణ ప్రగతి ప్రహారి నిర్మాణ పనులు స్థానిక కౌన్సిలర్ మర్రి మాధవి మహేందర్ రెడ్డితో కలిసి చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ కార్యక్ర మాలలో కౌన్సిలర్లు రవీందర్‌రెడ్డి, ఉదరు శ్రీ గోపాల్‌రెడ్డి, నాయకులు రొక్కం చంద్రశేఖర్‌రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.