Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వనస్థలిపురం
రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభను పురస్కరిం చుకుని సోమవారంనాడు వనస్థలిపురం కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షుడు తాడేపల్లి వెంకటేశం కార్యవర్గం ప్రతిభా పురస్కారాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 90 మంది 95 అధికంగా మార్కు లు వచ్చిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల తో సన్మానం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనా రాయణ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రాష్ట్ర మహాసభ పొలిటికల్ చైర్మెన్ చింతల రవికుమార్, మహాసభ కార్యవర్గ సభ్యులు ఊర లక్ష్మణ్, రాష్ట్ర మహాసభ ప్రధాన కార్యదర్శి కాచం సుష్మ, జిల్లా మహాసభ సభ్యులు, జిల్లాలోని మండల సభ్యులు వివిధ బస్తీ సంఘ సభ్యులు పాల్గొన్నారు.