Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ త్రైవార్షిక మహాసభలు హైదరాబాద్ పోస్ట్ ఆఫీసు ఆవరణలో సోమవారం జరిగాయి. ఈ సంద ర్భంగా ముఖ్య అతిథులు ప్రసంగిస్తూ సిబ్బంది సమస్యలు, భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పటిష్టత తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. బి.ఎం.ఎస్. జాతీయ ఉపాధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో నవంబర్ 16న భారీ ప్రదర్శన చేపట్టనున్నట్టు తెలి పారు. ఈ సభ చివరన రాష్ట్ర భారతీయ పోస్టల్ ఎంప్లా యీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఎన్నికలు జరిగా యనీ, నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన పి.లక్ష్మినారాయణ సోమవారం సికింద్రాబాద్లో మీడియా కు తెలిపారు. రాష్ట్ర తెలంగాణ సర్కిల్ అధ్యక్షుడు వెంకటే ష్, కార్యదర్శి పి.లక్ష్మినారాయణ, ఫోస్టుమెన్, ఎంటీఎస్. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ కార్యదర్శి అంజన్ కుమార్, గ్రామీణ డాక్ సేవక్ అధ్యక్షుడు అశోక్ తేజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. తర్వాత మిగతా కార్యవర్గ సభ్యు లను ఎన్నుకుని ప్రకటిస్తామని లక్ష్మి నారాయణ వివరిం చారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఉన్న తపాల సిబ్బంది బీపీఈఎఫ్.సభ్యులు పాల్గొన్నారు. సెక్రెట రీ జనరల్ అనంత్ పాల్, సంఘటనా కార్యదర్శి సంతోష్ సింగ్, బి.ఎం.ఎస్. జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లేష, బి.ఎం.ఎస్ రాష్ట్ర నాయకులు రవీంద్ర వర్మ, రామిరెడ్డి, విష్ణు వందన, రవి శంకర్, అల్లూరి పాల్గొన్నారు.