Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
సింగరేణి విశ్రాంత కార్మికుల పెన్షన్ పెంచాలని బీజే పీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకి సింగరేణి విశ్రాంత కార్మికులు వినతిపత్రం అందజేశారు. ''ప్రజా సంగ్రామ యాత్ర'' లో భాగంగా దమ్మాయిగూడకు విచ్చేసిన సంద ర్భంగా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు సంజ రును కలసి సింగరేణి విశ్రాంత కార్మికులకు 1998లో ప్రవేశపెట్టిన ''కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998'' ప్రకారం అతి తక్కువగా రూ.వెయ్యి పెన్షన్‌తో జీవిస్తూ చాలా కష్టాల్లో జీవిస్తున్నామని తెలిపారు. నేటి జీవణ ప్రమా ణాలు అనుసరించి పెన్షన్ పథకం సవరించి పెన్షన్ పెంచాలని కోరారు. సైనిక ఉద్యోగులకు ''వన్ ర్యాంక్-వన్ పెన్షన్'' చెల్లిస్తునట్లుగా, బొగ్గు విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాలనీ, సింగరేణి విశ్రాంత కార్మికులు హైద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి నగరాల్లో జీవిస్తున్న వారికి బీపీ షుగర్, గుండె, మూత్రపిండాల వ్యాధులతో వారికి నెలవారీ మందులను వారు నివసిస్తున్న చోటనే పంపిణీ చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రత్యేక వైద్య విభాగం ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేష న్ ఉపాధ్యక్షులు ఆళవందార్ వేణు మాధవ్, కార్యదర్శి బుపెల్లి బానయ్య, సలహాదారులు టి.ఉమాకర్, కోశాధికారి యం.విజయ బాబు, ఎస్.లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.