Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలా నగర్ ఆఫీసులో ప్రముఖ రచయిత, అభ్యుదయ వాది తాపి ధర్మారావు జన్మదిన కార్యక్రమం జరిగింది. సమావేశానికి ప్రారంభ సూచికగా తాపి ధర్మారావు చిత్రపటానికి పట్నం అధ్యక్షులు డీజీ. నరసింహారావు, కోమటి రవి పూల మాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీ నరసింహారావు మాట్లా డుతూ తాపి ధర్మారావు ప్రముఖ రచయిత, అభ్యుదయ వాది అన్నారు. ఆల యం మీద బూతు బొమ్మలు ఎందుకు, పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు లాంటి అద్భుతమైన పుస్తకాలను రచించారని తెలిపారు. సినిమా రంగంలో కూడా మొట్టమొదటిసారిగా తెలుగులో చక్కని అద్భుతంగా సినిమాలు రూపొంద టానికి కృషి చేశారని తెలిపారు. ప్రముఖ రచయిత పి.బి చారి మాట్లాడుతూ అనేకమంది రచయితలు కవులు తాపి ధర్మారావు సాహిత్యం పై పరిశోధనలు చేసి పీహెచ్డీ డిగ్రీలు కూడా పొందారని చెప్పారు. మొదటిసారి తెలుగు సిని మాలు స్క్రీన్ ప్లే రూపకల్పన చేసింది కూడా తాపి ధర్మారావు అన్నారు. వారి కుమారుడు తాపీ చాణిక్య కూడా అభ్యుదయ భావాలతో నాటక రంగంలో సినిమా రంగంలో అద్భుతమైన కృషి చేశారని తెలిపారు. సామాజిక ఉద్యమ నాయకులు కోమటి రవి మాట్లాడుతూ అనేకమందికి ప్రేరణగా నిలిచారని వారి సాహిత్యం నేటికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తెలుగులో మొట్టమొదటిసారిగా ప్రాచీన సాహిత్యంతో కూడిన పాతపాళీ రాసి తర్వాత గ్రాంథిక భాష నిరుపయోగమని వ్యవహారిక భాషలో కొత్తపాళీ రాసి ఎంతో స్ఫూర్తిదాయకమైన కృషి చేశారని చెప్పారు. ఆయన కుమారుడు వారి కుటుంబం అభ్యుదయ ఉద్యమంలో భాగస్వామ్యం ప్రజా సంక్షేమానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. తాపి ధర్మారావు జీవిత విశేషాలను అధ్యక్షత వహించిన గొడుగు యాదగిరిరావు వివరించారు. అంతిమంగా సభ్యులందరూ తాపి ధర్మారావు చిత్రపటానికి పూలను సమర్పించి నివాళి అర్పించారు. ఈ సమావేశంలో సంతోష్, బ్యాగరి వెంకటేష్, శ్రీనివాసరావు, గౌసియా, జి. శివరామకృష్ణ, వెంకట్ పాల్గొన్నారు.