Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్ట డంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మహా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్యపాగ నర్సింగ్ రావు, తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవ స్థాపక అధ్యక్షుడు గడ్డ యాదయ్య ఆధ్వర్యంలో సోమ వారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ఎదుట మాదిగ డప్పుల దండోరాతో నిరసన తెలిపారు. నిరసన చేస్తున్న మాదిగ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి కాచిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంద ర్భంగా ముఖ్యపాగ నర్సింగ్ రావు, మీసాల రాము, గడ్డ యాదయ్య మాట్లాడుతూ మూడు దశాబ్దాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తుంటే బీజేపీ ప్రతిపక్ష హౌదాలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేసిందని తెలిపారు. అథికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలను మోసం చేసిన బీజేపీ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధ కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ఇంటిముందు వేలాది మందితో మాదిగ డప్పుల దండోరాతో నిరసన కార్యక్ర మం తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జాజాల రమ్య, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మానల రాజేశ్వర్ రావ, తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్, తెలంగాణ దండోరా రాష్ట్ర అధికార ప్రతినిధి మానేరు లూకా, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షురాలు గజ్జల సంపూర్ణ, ప్రధాన కార్యదర్శి గోర్ల సరస్వతి, తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాములు, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకుసాల సంపత్, మహా ఎమ్మార్పీఎస్ మేడ్చల్ జిల్లా ఇన్చార్జి దుబ్బాక లక్ష్మణ్, అధ్యక్షులు ముత్యపాక శ్రీశైలం, మహా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోతుకులపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి తాటికాయల కొమురయ్య, తెలంగాణ దండోరా స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ కో-ఆర్డినేటర్ మీసాల ఎల్లేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.