Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, నియోజకవర్గాల పెంపు విషయమై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గం జీవో విడుదల చేయాలని ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా, అధిక ఓటర్లు విన్న ప్రాంతం విస్తీర్ణంలో చాలా పెద్దది కావున, కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని మూడు నియోజకవర్గాలుగా విభజించాలని... ఒకటి కుత్బుల్లాపూర్ జీడిమెట నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీతో కలుపుకొని, రెండవది సూరారం గాజుల రామారావు నియోజకవర్గం, మూడవది నిజాంపేట్ బాచుపల్లి నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీతో కలుపుకొని ప్రతిపాదనలు పంపడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేకి టిఆర్ఎస్ నాయకులు రవి యాదవ్, సోమేశ్ కుమార్, వెంకటస్వామి, పర్యావరణ ప్రేమికుడు సామాజిక కార్యకర్త కోల రవీందర్ ముదిరాజ్తో కలిసి ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.