Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
గడిచిన నాలుగు మాసాల నుండి రోజుల తరబడి వర్షాలు కురవడంతో సామాన్య ప్రజల బ్రతుకులు ఆగమవు తున్నాయి. ముఖ్యంగా చిరు వ్యాపారులు నష్టపోతున్నారు. జూన్ నెల నుండి ప్రారంభమైన వర్షాలు రోజుల తరబడి కురవడంతో చిరువ్యాపార స్తులు, భవన కార్మికులు, పెయిం టింగ్లతో పాటు వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు సరైన ఉపాధి లేక ఇక్కట్లు గురవుతున్నట్లు వాపోతున్నారు. నాగోల్ డివిజన్లో దేశంలోని పలు ప్రాంతాల నుండి వలసలు వచ్చి ఇక్కడ నివాసాలు ఉంటూ కొంత మంది చిరు వ్యాపారాలను కొనసాగిస్తుండగా మరి కొంత మంది భవన, పెయింట్లతోపాటు వివిధ రంగాలలో పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నట్లు తెలిపారు. వారాల తరబడి వర్షాలు కురవడంతో తమకు సరైన ఉపాధి లేక తమ కుటుంబాల పోషణ తీవ్ర భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెల వరకు నెలలో 20 రోజులు పని దొరికిందని, ఈ వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి నెలలో పట్టుమని 15 రోజుల పని దొరకడమే గగనంగా మారింద న్నారు. దీంతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో, అదేవిధంగా తమ పిల్లల చదువులు ఎలా కొనసాగించు కోవాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దినసరి కూలీల బ్రతుకులు ఇలా ఉంటే చిరు వ్యాపారస్తుల పరిస్థితి కూడా అంతంత మాత్రాంగానే ఉన్నట్టు తెలుస్తుంది. పండ్లు, కూరగాయలు, బొమ్మలు, సెల్ఫోన్ సంబంధించిన సామాగ్రితో పాటు తదితర చిరువ్యాపారస్తులు నగరంలో రోడ్ల పక్కన తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాలు కొనసాగి స్తున్నారు. దీంతో వారు ఎంతో కొంత సంపా దించుకొని తమ కుటుంబాలను పోషించుకుంటున్నట్లు తెలిపారు. చిరువ్యాపారస్తుల దగ్గర పెట్టుబడి లేకపోవ డంతో రోజువారి ఫైనాన్సుగా అప్పులు చేసి ఆ రోజుకు సరిపడా సరుకును తెచ్చుకొని సాయంత్రానికి జరిగిన వ్యాపారంతో తిరిగి వచ్చిన డబ్బులతో అప్పులు చెల్లించి మిగిలిన వాటితో తమ కుటుం బాలను పోషించు కోవడం వారి నిత్యజీవనంగా మారింది. కానీ గడిచిన నాలుగు మాసాల నుండి తాము కొనసాగిస్తున్న దుకాణాలవద్దకు కొనుగోలు దారులు తగినంత మంది రాకపోవడంతో తమ వ్యాపారాలు నడవక చతికిల పడ్డా యని, దీంతో తెచ్చిన పండ్లు, కూరగాయలు సరైన సమ యంలో అమ్ముడుపోక, కుళ్ళిపోయి నష్టపోవడమే కాకుండా తెచ్చిన అప్పులు రోజురోజుకు పెరిగిపోవడం తమకు తలకు మించిన భారంగా మారుతుందని పలువురు వాపోతున్నారు. తమలాంటి వారిని ప్రభుత్వాలు గుర్తించి సహకరిస్తే ఎంతో కొంత తమకు ఆసరా అవుతుందని భావిస్తున్నారు.
కరోనా కంటే ఎక్కడో అక్కడ కూలి దొరికితే అక్కడికి వెళ్లే వారం, కానీ కరోనా లో పనులు దొరుకక ఇబ్బందికర పరిస్థితుల్లో పండ్ల వ్యాపారానికి వెళ్లి నడుపుతున్నాను. ఇప్పుటి వరకు బాగానే నడిచింది. కానీ మూడు నెలల నుండి వర్షాలు కురవడంతో రోడ్లపై ఉన్న తమ వ్యాపారం నడవకపోవడం కొనుగోలుదారులు రాకపోవ డంతో నష్టాలను భరిస్తూ వస్తున్నాం. ఈ వ్యాపారానికి అలవాటు పడ్డాక మరో పనిచేయలేక దీనిపైన ఆధారపడి కష్టనష్టాలను భరిస్తూ కొనసాగిస్తున్నాం. మాలాంటి వారికి ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుంది
- వెంకటేష్, పండ్ల వ్యాపారి
తాను కొంతకాలం పాటు ఇతర పనులకు వెళ్తూ మా ఆవిడ బండిపై కూరగాయలు పెట్టుకొని వ్యాపారం చేస్తుంది. గడిచిన నాలుగు మాసాలు నుండి నాకు ఎక్కడా ఇతర పనులు దొరక్కపోవ డంతో నేను కూడా మరో బండిని తీసుకొని కూరగాయల దుకాణాన్ని నడుపుతున్నాను. కానీ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకుం డాపోతుంది. దీంతో పూర్తిగా కూరగాయల వ్యాపా రంపై ఆధారపడి కుటుం బాన్ని పోషించుకొంటున్న. నాకు వ్యాపారం నడవక పలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నా. వారాలు తరబడి వర్షాలు కురువ డంతో కొనుగోలుదారులు రాక, తెచ్చిన సరుకులు కుళ్లిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. వ్యాపారం కోసం తెచ్చిన అప్పులు తీర్చడం ఇబ్బందికరంగానే ఉంది.
- శ్రీనివాస్ యాదవ్, కూరగాయల వ్యాపారి బండ్లగూడ
పూలు పండ్ల వ్యాపారం భీమవరం నుండి వచ్చి బండ్ల గూడలో ఉంటున్నాం. కరోనా కంటే ముందు ఇండ్లలో పనిచేస్తూ తమ కుటుం బాన్ని పోషించుకుం టుండేదాన్ని, కానీ కరోనా నుండి ఎవ్వరు తెలవకపోవడంతో అప్పట్లో పూలు పండగ దుకాణా లను ప్రారంభించి నడుపుతు న్నాను. కానీ జూన్ నుండి జూన్ వరకు బాగానే వ్యాపారం నడిచింది, కానీ జూన్ నుండి ప్రారంభమైన వర్షాల వల్ల వ్యాపారం నడవక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తెచ్చిన అప్పులు తీర్చడం కష్టంగా మారింది.
- పద్మ, పూలు పండ్ల వ్యాపారం బండ్లగూడ
జూన్ నెల కంటే ముందు 24 రోజుల పని దొరికేదని, జూన్ నుండి వర్షాలు ప్రారంభం కావడం తో విపరీతమైన వర్షాలు కురవ డంతో పట్టుమని పది రోజులుగా కూడ పని దొరకడం లేదు. దీంతో కుటుంబ పోషణ, ఇంటి అద్దెలు కూడా ఇబ్బందికరంగా ఉంది.
- పోలే చంద్రయ్య, తాపీ మేస్త్రి .
నగరంలో ఎక్కువమంది భవన నిర్మాణంపై ఆధారపడి తమ జీవనాన్ని గడుపుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఎప్పుడైనా ఎంతో కొంత పని దొరికి ఉండేదని కానీ ఈ సంవత్సరం వారాల తరబడి కొరవడటంతో ఉపాధి కరువైంది. దీంతో సరిపడా ఉపాధి దొరకకపోవడంతో తాపీ పనిపై ఆధారపడి ఉన్న భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే కొంతమంది కాంట్రాక్ట్ మేస్త్రీలు బీహార్, యూపీలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిన మేస్త్రిలను, కూలీలను తెచ్చుకుని పనిచేస్తుం డడంతో స్థానికంగా ఉన్న కార్మికులకు సరైన ఉపాధి కరువైంది. దానికి తోడు ఈ సంవత్సరం అధికంగా వర్షాలు వరుసగా కొరవడంతో యజమానులు, భవనాల నిర్మాణాల కాంట్రాక్టర్లు కురుస్తున్న వర్షాలకు నిర్మాణా లను కొనసాగించడానికి ముందుకు రాకపోవడంతో ప్రధానంగా స్థానిక భవన కార్మికులకు సరిపడ పనిదొరకడం లేదు. గతంలో నెలలో 24 రోజులు పని దొరుకుతుండగా, ఈ వర్షాకాలంలో పట్టుమని 15 రోజులు కూడా కరువైంది. ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాల్సి ఉంది.
- జి .చైతన్య
భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి.
సీఐటీయూ, నాగోల్ డివిజన్