Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
పద్మభూషణ్ డాక్టర్ ఏఎస్ రావు 108వ జయంతిని పురస్కరించుకుని ఈసీఐఎల్ సాయి సుధీర్ పీజీ కాలేజ్లో రక్తదాన శిబిరం నిర్వహించా రు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 500 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి, డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ వెంకట నారాయణ రెడ్డి, కాలేజ్ చైర్మెన్ ఉషారాణి, హరీష్ రెడ్డి, కల్పనా రెడ్డి, కృష్ణారెడ్డి, కష్ణ ప్రసాద్, శ్రీదేవి రవి కుమార్ యాదవ్, నేమూరి మహేష్ గౌడ్, బైరి నవీన్ గౌడ్, అరవింద్, జింపాల్ రెడ్డి, నరేష్ పాల్గొన్నారు.
ఏఎస్రావు నగర్ గ్రౌండ్లో..
ఏ.ఎస్.రావు జయంతిని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వెల్ఫేర్ కమిటీ సభ్యులతో కలిసి ఏ.ఎస్ రావు నగర్ గ్రౌండ్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమంలో డా.ఏ ఎస్.రావు నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కాకుల రాజేశ్వర్ రావు, సోమయ్య చారి, టీఆర్ఎస్ నాయకులు షేర్ మణెమ్మ, ఏనుగు సీతారామరెడ్డి, మంజుల, సింగం రాజు, యాకయ్య, సురేంద్ర చారి, బాజి బాషా, భాస్కర్, నర్సింహ, హరినాథ్ రెడ్డి, సురేందర్ రావు తదితరులున్నారు.
స్ఫూర్తి గ్రూపు ఆధ్వర్యంలో..
తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఏఎస్రావు జయంతి సంద ర్భంగా వైజ్ఞానిక దృక్పథం ఆవశ్యకత అనే అంశంపై సెమినార్ ఈసీఐఎల్ కమలానగర్ రౌండ్ బిల్డింగ్ వద్ద లైన్స్ క్లబ్ హాల్లో జరిగింది. అతిథులను వెంకట్ వేదిక పైకి ఆహ్వానించారు. ప్రారంభ సూచికగా ఏఎస్ రావు చిత్రపటానికి శిరీష సోమశేఖర్ రెడ్డి, ప్రధాన ఉపన్యాసకులుగా వచ్చిన విజ్ఞానవేత్త టి.రమేష్, లైన్స్ క్లబ్ కుషాయిగూడ చైర్మెన్ లైన్ కొత్త రామారావు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రహీం, గగన్ కుమార్, వెంకట సుబ్బయ్య, నాగయ్య , కోమటి రవి, బ్యాగరి వెంకటే ష్, సోమయ్య, వెంకటేష్, పాష, రాజమల్లు, సోమ యాచారి, జి.శివరామకృష్ణ, ఆర్ఎస్ఆర్ ప్రసాద్, జి. శ్రీనివాస్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఏఎస్రావు నగర్ డివిజన్లో..
ఏఎస్ రావు జయంతి సందర్భంగా ఏఎస్రావు నగర్ డివిజన్లో గల డాక్టర్ ఏఎస్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో నీరుకొండ సతీష్ బాబు, ఎస్ఏ రహీం, సాయి నాగార్జున, పసల ప్రసాద్, హేమంత్ కుమార్ గౌడ్, జనార్ధన్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
జై జైవాన్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
ఏఎస్ రావు జయంతి సందర్భంగా కాప్రా సర్కిల్లోని జై జవాన్ కాలనీలో డాక్టర్ ఏఎస్రావుకి నివాళ్లు అర్పించారు. కాలనీ అధ్యక్షులు తిరుమలయ్య ఏఎస్రావు చిత్రపటానికి పూలమాల వేసి సభను ప్రారంభించారు.