Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
సోమాలియాకు చెందిన ఫదుమో మొహమ్మద్ ఒమర్ అనే 33 ఏండ్ల మహిళ 12 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు స్థానికంగా ఆమెకు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఉన్నది అని ఆమెకు డాక్టర్స్ తెలిపారు. క్యాన్సర్ థెరపీ తో తల్లి, బిడ్డకు అధిక ప్రమాదం అని చెప్పారు. దీంతో వెంటనే ఆమెకు తెల్సినవాళ్ల ద్వారా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాద్విక్ రఘురాంను కలిశారు. దీంతొ డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న గర్భిణీ, ఆమెకు పుట్టబోయే బిడ్డను రక్షించడానికి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ ఛాలెంజ్‌ని తీసు కుంది. మహిళకు కీమోథెరపీ చికిత్స అందించారు. ఈ కీమో కోర్సులో తల్లి, పిండం ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించారు. చివరగా ఆమె అన్ని కీమో కోర్సులను విజయవంతంగా పూర్తి చేసింది. ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ సాద్విక్ రఘురాం మాట్లాడుతూ ఒకవేళ ఆమె నిర్లక్ష్యం చేసి ఉంటే ''క్యాన్సర్ శరీరమంతా వ్యాపించి చివరికి తల్లీ బిడ్డల మరణానికి దారితీసేది'' అన్నారు. తల్లితో పాటు బిడ్డని నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇద్దరి ప్రాణాలనూ కాపాడగలిగాం అని తెలిపారు.