Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే అక్రమార్కుల భరతం పడతామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్ అన్నారు. మంగళవారం కార్పొరేషన్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కడుతున్న ఇండ్లను జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ కార్పొరేషన్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇండ్లు నిర్మించరాదన్నారు. కబ్జాదారులు అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్ముతూ మోసం చేస్తున్నారనీ, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.