Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
కాంట్రాక్టర్లు పనుల కోసం వేగం పెంచి సలాలంలో పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం నేరెడ్మెట్ డివిజన్ పరిధిలోని ఆర్కేపురం చెరువు దగ్గర కొనసా గుతున్న పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, డీఈ మహేష్, ఏఈ సజన, నాయకులు ఉపేందర్ రెడ్డి, ఎస్ఆర్.ప్రసాద్, గుండా నిరంజన్, మహాత్య వర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, రాజు, పిట్ల శ్రీనివాస్, భాగ్యనంద్ రావు, మంద భాస్కర్, మబ్బు, గోపాల్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.