Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
నల్లగొండ వాసి భూతం-ముత్యాలు అనే ఒక సామాన్యుడి జీవితాన్ని కాకతీయ యూనివర్సిటీ పాఠ్య అంశంగా తీసుకొన్న యదార్థ గాధ దృశ్యరూపమే తమ సూరీడు చిత్రమని దర్శకుడు పీసీ ఆదిత్య అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సూరీడు చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. గొప్ప రచనలు చేసిన భూతం ముత్యాలు జీవితాన్ని ఆధారంగా చేసుకొని వస్తున్న ఈ సూరీడు చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలని అన్నారు. క్రమశిక్షణ, అంకిత భావం ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయాలే వస్తాయాన్ని అందుకు ఆయన గురువు దాసరి నారాయణ ఒక గొప్ప ఉదాహరణ అనీ తెలిపారు. తదనంతరం ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహ రావు తొలి క్లాప్‌నివ్వగా, జ్యోతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆశా జ్యోతి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఐలయ్య, కవి వేముల ఎల్లయ్య, భూతం ముత్యాలు చిత్ర నటీనటులు పాల్గొన్నారు.